దలైలామాతో బేషరతు చర్చలు కోరుతున్న అమెరికా
టిబెటిన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాతో బేషరతు చర్చలు జరిపేందుకు అనుమతివ్వాలంటూ అగ్రరాజ్యం అమెరికా చైనాను కోరుతోంది. టిబెట్ లో అమలవుతున్న విధానాలు సృష్టించిన ఉద్రిక్తత గురించి ఈ చర్చల్లో ప్రధానంగా వివరించాలని యూఎస్ కోరుకుంటోంది. దీనిపై అమెరికా ఉప ప్రతినిధి మేరీ హార్ఫ్ మాట్లాడుతూ, టిబెట్ లో పేదల మానవ హక్కుల పరిస్థితి గురించి తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దలైలామాతో తాము సుదీర్ఘ చర్చలు జరిపేందుకు అంగీకరించాలని చైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. లేకుంటే ఆయన ప్రతినిధులతో షరతులు లేని విధంగా మాట్లాడి అక్కడి ఉద్రిక్తతలను నివారించాలని చైనాను కోరుతున్నామన్నారు. లేకుండా టిబెటిన్ ప్రత్యేక సంస్కృతికి త్వరలో ముప్పు వాటిల్లే అవకాశముందన్నారు.